గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో KKR జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన KKR 32 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు టిమ్ సిఫర్ట్ (19), రహానె (0) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. వన్ డౌన్ బ్యాటర్ రఘువంశీ కూడా 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో గ్రీన్, పావెల్ ఉన్నారు.