ADB: పాలిసెట్ ప్రవేశ పరీక్ష 2026-27 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శుక్రవారం తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే నెల 13వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.