BPT: వేటపాలెంలో ఎస్సై జనార్దన్ ఆధ్వర్యంలో శుక్రవారం ‘శిరోరక్ష- ప్రాణరక్ష’ కార్యక్రమంలో భాగంగా 40 ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జనార్దన్ పాల్గొని ‘శిరోరక్ష-ప్రాణరక్ష’ వాల్ పోస్టర్లను బస్సులు, ఆటోలకు స్వయంగా అంటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే ప్రమాద సమయంలో ప్రాణానికి రక్షణగా నిలుస్తుందన్నారు.