కడపలోని ఎర్రముక్కపల్లెలో మట్కా ఆడుతున్న వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ చిన్న పెద్దయ్య ఆదేశాల మేరకు ఎస్సై అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిందితుడి వద్ద నుంచి రూ. 5 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్, మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.