కృష్ణా: గన్నవరం నియోజకవర్గాన్ని ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం అంబాపురంలో జరిగిన ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించి సమస్యలు విన్నారు. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నామని, త్వరలోనే అగ్రస్థానానికి తీసుకువస్తామని ఆయన తెలిపారు.