NDL: నంద్యాల పట్టణంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఓ విశేషమైన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇద్దరు HIV బాధితులు ఆదర్శ వివాహం చేసుకుని సమాజానికి సానుకూల సందేశాన్ని అందిస్తూ ప్రశంసలు అందుకున్నారు. నంద్యాల ఎస్.ఆర్.బీ.ఎస్ కాలనీలో ఉన్న పరివర్తన్ లైఫ్ సెంటర్లో HIV బాధితుల ఆదర్శ వివాహాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.