BDK: ఏపీలో విలీనం చేసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ రేపు భద్రాచలంలో సమరభేరి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఎంపీ రేణుక చౌదరి హాజరు కానున్నారు. ఐదు గ్రామపంచాయతీల అంశంపై స్థానిక ప్రజల్లో అసంతృప్తి కొనసాగుతుంది. వాటిని తిరిగి తెలంగాణలో చేర్చాలని ప్రజలు, వివిధ సంఘాలు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి.