KMM: ఖమ్మం నగరంలోని 34,35,36 వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలోగా సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, మేయర్ పూనుకొల్లు నీరజ పాల్గొన్నారు.