NRPT: ప్రతి మెడికల్ షాపులో ఫార్మాసిస్టు ఉండాలని, నిబంధనలు అతిక్రమించి మందులు విక్రయించరాదని జిల్లా వైద్య శాఖ అధికారి జయ చంద్రమోహన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ అన్నారు. నారాయణపేటలో ఔషధ నియంత్రణ బలోపేతం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మకూడదని హెచ్చరించారు.