HYD: రిజిస్టర్డ్ వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్, అలవాటుగా మారే మందులు విక్రయించవద్దని ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.దాసు కెమిస్టులకు సూచించారు. శనివారం అంబర్పేటలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.