చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ‘డ్రాఫ్ట్ నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (NFI) 2026’లో భాగంగా.. రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు, జలుబు సిరప్లను ప్రిస్క్రైబ్ చేయకూడదని, అమ్మకుండా బ్యాన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.