WNP: గోపాల్పేట మండలం మున్నానూర్ గ్రామానికి చెందిన పరగోర్ల బుచ్చయ్య (75) ఫిబ్రవరి 21 నుంచి కనిపించకుండా పోయారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని మనవడు రాముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇలా వెళ్లి వచ్చేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. అదృశ్యమైన సమయంలో తెల్ల అంగి, తెల్ల లుంగీ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు.