అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో తొలి దశలో 2,784 ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు మంజూరు కాగా, రూ.33.40 కోట్లతో ప్రాజెక్ట్ అమలు జరుగుతోంది. చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్వావలంబన పెరుగుతుంది.