KKD: జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ, పోలీసులు దాడులు చేస్తున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. గురువారం బి.ప్రత్తిపాడులోని రైస్ మిల్లులపై జరిపిన దాడుల్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడటంతో కేసులు నమోదు చేశారు. కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ఈ దందాను అరికట్టేందుకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.