కోనసీమ: ఆలమూరు మండలం మడికి గ్రామంలో ఆదివారం మధ్యాహం సీఐ విద్యాసాగర్ హైవే మొబైల్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. హైవేపై రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి ట్రాఫిక్ నిబంధనలు వివరించి, చట్టపరంగా చర్యలు తీసుకుని సరైన మార్గంలో వెళ్ళమని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలో అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.