సత్యసాయి: ధర్మవరం మండలంలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన ఒబులనాయనపల్లిని గురువారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సందర్శించారు. గ్రామస్థులు, మహిళలతో మాట్లాడి శాంతి భద్రతలను సమీక్షించారు. గొడవలు, కక్షల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, యువత నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు.