PLD: నరసరావుపేట బస్టాండ్‌లో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈవ్ టీజింగ్, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ వినియోగం, SOS సేవలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, ర్యాగింగ్, వేధింపుల నివారణపై వివరించారు. అత్యవసర సమయంలో 112, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని సూచించారు. మహిళలు, యువతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.