ASR: జిల్లాలో మలేరియా కేసుల సంఖ్య తగ్గాలని కలెక్టర్ టీ.నిశాంతి అన్నారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా మలేరియాను ధైర్యంగా ఎదుర్కోవచ్చన్నారు. మలేరియా నివారణ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉబ్బేటిపుట్టు గ్రామంలో పర్యటించి, గ్రామంలో దోమల నివారణకు పిచికారి కార్యక్రమాన్ని ప్రారంభించారు.