SRD: ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి తీసుకున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఉమా హారతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండు పలువురు అధికారులు ఉన్నారు.