AKP: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 145, రెవిన్యూ క్లినిక్కు 169 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి మాట్లాడారు. పీజీఆర్ఎస్లో తమ దృష్టికి వచ్చిన అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.