BPT: ఇంకొల్లులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెండు ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఒకటి, భూ వివాదంపై మరొకటి వచ్చినట్లు చెప్పారు. వాటిని సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.