టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తదుపరి లక్ష్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘వన్డే ప్రపంచకప్ గెలవడం మా తదుపరి లక్ష్యం. గత ఫైనల్లోనే మేం తృటిలో టైటిల్ కోల్పోయాం. సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2027 మాకు మరో అవకాశం. ఏ ఫార్మాట్లోనైనా దేశం కోసం ప్రపంచకప్‌ను గెలవడం మా ప్రధాన లక్ష్యం. ఈ ఆలోచన ఎప్పుడూ నా మనసులో తిరుగుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నాడు.