ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో సోమవారం ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి లక్ష్మణ్ యాదవ్ అనే కార్మికుడు మృతి చెందాడు. పనిలో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరగడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.