BPT: కొరిసపాడు మండలం బొడ్డువారిపాలెం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏల్చూరి కస్తూర్భా పాఠశాల SO లక్ష్మి, ఆమె భర్త రవిబాబు గాయపడ్డారు. పాఠశాల నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని వెంటనే చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.