HNK: తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మడికొండలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అనేకమంది అమరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరీష్ రెడ్డి, మోహన్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.