TG: స్పీకర్ ఓంబిర్లాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. రికార్డుల నుంచి తేజస్వి వ్యాఖ్యలు తొలగించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన స్పీకర్.. రికార్డుల నుంచి తెలంగాణ విభజనపై చేసిన ఆయన వ్యాఖ్యలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. తేజస్వి అవగాహన లేకుండా మాట్లాడారని.. దీనిపై టి.బీజేపీ ఎంపీలు కనీసం అభ్యంతరం చెప్పలేదని కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు.