»Mahesh Babu Escaped From The Police His Past Lifestyle
Mahesh babu: పోలీసుల నుంచి తప్పించుకున్న మహేష్ బాబు!
అసలు సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) పోలీసులకు(police) దొరికిపోవడం ఏంటి? అనే డౌట్స్ అక్కర్లేదు. పోలీసులు మహేష్ బాబు వెంట పడింది నిజమే. కాకపోతే ఆ సమయం, సందర్భం, వయస్సు వేరు. మరి మహేష్ పోలీసులకు ఎందుకు దొరికిపోయాడు?
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), మాటల మాంత్రికు త్రివిక్రమ్ కలిసి.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు..మహేష్ బాబు ఫారిన్ వెకేషన్ కారణంగా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మహేష్ తిరిగి ఇండియా వచ్చేశాడు. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్‌కి రెడీ అవుతున్నాడు. రీసెంట్‌గానే ‘మేమ్ ఫేమస్’ అనే సినిమా చూసి బాగుందని రివ్యూ కూడా ఇచ్చేశాడు.
ఇక మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. ఎస్ఎస్ఎంబీ 28(ssmb28) టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అదే రోజున కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో.. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మీడియాతో పంచుకున్నారు. తమ కుటుంబంలో రమేష్ బాబు తర్వాత మహేశ్ బాబు సక్సెస్ అవుతారని ముందే ఊహించానని ఆయన తెలిపారు.
అలాగే మహేశ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయని.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. మహేశ్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ (mimicry artist) అని.. ఎవరినైనా, ఏ వాయిస్ అయినా మిమిక్రీ చేయగలడని చెప్పారు. అయితే మహేశ్ గురించి చాలా మందికి తెలియని మరో విషయమేమిటంటే.. 14 ఏళ్ల వయసులోనే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపేవాడట మహేష్.
అలాంటి సమయంలో ఓ సారి పోలీసులు(police) దొరికిపోయాడట మహేష్. లైసెన్స్ కోసం మహేష్‌ను కారు ఆపమని పోలీసులు చెప్పారట. కానీ మహేష్ కారు ఆపకుండా డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేశాడు. దాంతో పోలీసులు మహేష్ వెంట పడ్డారని.. కానీ వాళ్లను తప్పించుకునేందుకు ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏదేమైనా సినిమాల్లోనే కాదు. రియల్ లైఫ్‌లోను మహేష్ బాబు చేసిన అల్లరి మామూలుగా లేదనే చెప్పాలి.