HYD: మంత్రి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రసాదం నాణ్యత, శుభ్రతపై ఆరా తీసి శాంపిళ్లు పరీక్షలకు పంపించారు. 200 గ్రాముల పులిహోర ప్యాకెట్ 150 గ్రాములే ఉండటాన్ని గుర్తించారు. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఒక పూజారిని తొలగించారు. EO, సూపరింటెండెంట్ సస్పెన్షన్కు ఆదేశించినట్లు సమాచారం.