GDWL: జిల్లా కోర్టు సముదాయాన్ని అనంతపురం గుట్టల వద్ద నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు గురువారం నుంచి నిరవధిక విధుల బహిష్కరణ చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు గేటు వద్ద నిరసన తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ప్రజలకు అందుబాటులో ఉండే స్థలాన్ని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.