SKLM: పలాసలో ముత్యాలమ్మ కోనేరు పార్కులో నెలకొన్న సమస్యలపై వాకర్స్ క్లబ్ సభ్యుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గురువారం పార్కును సందర్శించారు. జంతువుల బెడద, గంజాయి వ్యాపారులు, రాత్రి మద్యం సేవించేవారి వల్ల పార్కు అపరిశుభ్రంగా మారుతోందని సభ్యులు తెలిపారు. పార్కు చుట్టూ రక్షణ గోడ నిర్మించి సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.