NLR: కావలి పోలీసులకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రోగ్రాం కన్వీనర్ తటవర్తి రమేష్ ఫిర్యాదు చేశారు. ఆర్యవైశ్య సమాజం, వారి నాయకులపై అసత్య, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొడుతున్న పంచ్ ప్రభాకర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు డిజిటల్ ఆధారాలను పోలీసులకు సమర్పించామని, వాటి ఆధారంగా తక్షణమే దర్యాప్తు జరిపి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.