అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జగన్ మోహన్ రాజు గురువారం నందలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. వైద్యులు రోగులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలన్నారు.