SRCL: బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి ప్రవేశాల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించిన ఒక సీటుకు గురువారం లాటరీ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ జి. నగేష్ ఆధ్వర్యంలో జరిగిన డ్రాలో తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సిరిసిల్ల శ్రీటన్ కన్నా ఎంపికయ్యారు.