కోనసీమ: కపిలేశ్వరపురం మండలం వల్లూరులో నిర్వహించిన గ్రామ సందర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీ సర్వేలో అనేక లోపాలు చోటుచేసుకుని రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభల్లో భూ సమస్యలను పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు.