NDL: డోన్ పట్టణంలో ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంధాలయాల ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర పట్టణంలోని గ్రంథాలయాన్ని తనిఖి చేసి పిల్లలతో ముచ్చటించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో త్వరలో గ్రంథాలయం కొరకు నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. యువతకు పోటీ పరీక్షలకు కావలసిన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు.