KMM: ఖరీఫ్ సీజన్‌కు ముందు ప్రభుత్వం పంటల సాగు ప్రణాళిక ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. రైతులకు నిల్వ సదుపాయాల కోసం సమీప ప్రాంతాల్లో స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. మొక్కజొన్న, వరి కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, మద్దతు ధర పెంపుపై రైతులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.