RR: గ్రేటర్ HYD పరిధిలో రోజూ 27 లక్షల మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ నివేదిక వెల్లడించింది. మహాలక్ష్మీ పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. మియాపూర్-2 డిపోలో అత్యధికంగా రోజు ఒక లక్షకుపైగా ప్రయాణాలు నమోదవుతుండగా, అందులో 75 శాతం మహిళలవే కావటం విశేషం.