మహారాష్ట్ర MSRTC బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ నియమితులయ్యాడు. ఈ సందర్భంగా రితేష్ మాట్లాడుతూ.. MSRTCకి అంబాసిడర్గా ఎంపిక కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు. తన చిన్నతనంలో ఈ బస్సుల్లో ఎన్నోసార్లు ప్రయాణించానని గుర్తు చేసుకున్నాడు. రాష్ట్ర రవాణా రంగ అభివృద్ధికి, ప్రయాణికుల్లో అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నాడు.