కోనసీమ: నియోజకవర్గంలో ఎక్కడ వేసవిలో మంచి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం, నాగులచెరువు గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా తొడుగుడ్లపాడులో రూ.14.48 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను, ఇంటింటికీ మంచినీటి కుళాయి పధకాన్ని గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.