ATP: అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం పామిడిలో పర్యటించిన ఆయన, ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్‌ను పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం సొరకాయలపేటలో డ్రోన్ ద్వారా పంట పొలాల్లో మందు పిచికారీ చేసే విధానాన్ని పర్యవేక్షించారు.