ASF: జైనూర్ మండలం పానపఠార్ గ్రామపంచాయతీ గంగానగర్‌కు చెందిన ఐటీడీఏ మాజీ డైరెక్టర్ ఆత్రం భీమ్ రావ్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు , ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వారి గ్రామానికి చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.