MBNR: మహబూబ్ నగర్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం పూర్తి మద్దతు ప్రకటించింది. గురువారం స్టేడియం గ్రౌండ్ నుంచి డిపో వరకు భారీ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఫోరం ప్రధాన కార్య దర్శి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.