NRPT: ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత ఉత్తమ బోధన అందుతుందని HM భారతి అన్నారు. గురువారం జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు కిరీటాలు ధరింపజేసి ఘనంగా అభినందించారు. సెలవుల్లో సమయం వృధా చేయకుండా కథల పుస్తకాలు చదవాలని సూచించారు.