E.G: కడియం మండలం వేమగిరి గ్రామ శివారు ఎన్టీఆర్ నగర్లో శ్రీ సంకటహర అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఝాన్సీ లక్ష్మీ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, మాజీ సర్పంచ్ వెంకటాచలం సహా పలువురు నాయకులు హాజరయ్యారు. భక్తులు భారీగా పాల్గొన్నారు.