AP: తూ.గో. జిల్లా రాజానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు విద్యార్థినిపై పెట్రోల్ పోశాడు. తోటి విద్యార్థినులు కేకలు వేయడంతో ఆ యువకుడు పరారయ్యాడు. దీంతో గైట్ కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమను నిరాకరించిందని యువకుడి ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.