WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం బంద్ ఉండనుంది. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఈనెల 22 నుంచి ప్రతి బుధవారం మార్కెట్ బంద్ పాటిస్తున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ క్రమంలో రేపు మార్కెట్కు సెలవు ఉండగా.. రైతులు తమ సరుకులను యార్డుకి తీసుకొని రావద్దని అధికారులు సూచించారు.