SKLM: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమదాలవలస అగ్ని మాపక ఆఫీసర్ సనపల శ్రీనివాసరావు అన్నారు. శనివారం జాతీయ అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా ఆమదాలవలసలోని పలు ప్రాంతాలలో అగ్ని ప్రమాదాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.