సత్యసాయి: పెనుకొండలోని రామ మందిరం వీధిలో మురుగు కాలువ నిండి రహదారిపైకి పొంగి ప్రవహిస్తోంది. దీంతో రామ మందిరం, తోటగేరి ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా మురుగు నీరు రోడ్డుపైకి రావడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు.