కోనసీమ: టీడీపీ అంటే ఒక పార్టీ మాత్రమే కాదని, ఇదొక సమిష్టి కుటుంబమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం మానవవనరుల శాఖామంత్రి, యువ నాయకులు నారా లోకేష్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన డిన్నర్ ఆత్మీయ సమావేశం ఈ అంశాన్ని మరోసారి రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు.