నటి మంచు లక్ష్మి సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షపై ఘాటుగా స్పదించింది. మగవారు కఠిన నిర్ణయాలు తీసుకుంటే మెచ్చుకుంటారని, మహిళలు చేస్తే తప్పుగా చూస్తారని ఆవేదన చెందింది. తన భర్త గురించి చెబుతూ.. ‘నువ్వు ఏ పని చేయగలవో, నేను కూడా అదే చేయగలను’ అని పెళ్లిలోనే ఆయనకు చెప్పానని వెల్లడించింది. తను ఏదైనా తప్పు చేస్తే, నేను కూడా అదే చేస్తాననే భయం తన భర్తలో ఎప్పుడూ ఉంటుందని చెప్పింది.